Στίχοι
శ్రీరస్తు శుభమస్తు
కొత్త పెళ్ళి కూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో
జ్యోతిని వెలిగించగా
శ్రీరస్తు శుభమస్తు
కొత్త పెళ్ళి కూతురా కళ్యాణమస్తు
ఏ పూజకే పువ్వు రుణమై పూసిందో కాలానికే తెలుసట
ఆ కాలం కను మూస్తే కలగా చెదిరేది జీవితమొకటేనట
సవతిగా కాకుండా చెల్లిగా నను చూసి తల్లిని చేసావుగా
నీ పారాణి పాదాలు సేవించినా గాని రుణమే తీరదుగా
ఇది కలకాలమై ఉండగా
నీ అనుబంధమే పండగా
ఇంటికి దీపం ఇల్లాలనిపించు
నా ముద్దు చెల్లాయిగా
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
ఎదిగే మరణాన్ని యెదలో దాచేసి కథ రాసే దేవుడు
పంతాల గిరి గీసి ప్రణయాన్ని ముడి వేసి మోసం చేసాడు
రాగాల వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే
ఆ వేకువలా మళ్ళి రేకులు వెదజల్లే రవియై పుడతాడులే
ఆ దీపంలో నీ రూపమే
ఓ పాపల్లె ఆడాలనే
ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడేనులే
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
శ్రీరస్తు శుభమస్తు
మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
Written by: M.M. Keeravani, M.M.Keeravani S.V.Krishna Reddy, Veturi, Veturi Sundararama Murthy