Credits
PERFORMING ARTISTS
Vani Jayaram
Performer
COMPOSITION & LYRICS
K. V. Mahadevan
Composer
C.Narayana Reddy
Songwriter
Lyrics
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రథమ కళాసృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రథమ కళాసృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమా
పైరుపాపలకు జోలలు పాడే
పైరుపాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడి శ్రీంకారమా
ఆ బీజాక్షర వితతికి అర్పించే జోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రథమ కళాసృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి
పంచభూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన
అది కవనమా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలనఖేలన
అది నటనమా
కంటితుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణలేఖన
అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవకల్పన
అది శిల్పమా
ఆ లలితకళా సృష్టికి అర్పించే జోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రథమ కళాసృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి
Written by: C.Narayana Reddy, K. V. Mahadevan

