Lyrics
అమ్మ నువ్వంటే నాకు ప్రాణం
అమ్మ నీతోనే నాకు లోకం
నీతోనే నేనుంటా నీ రాణినంటా
నీలో కనిపించేది నా రూపేనమ్మా
నీ చేతుల్లో నా చేయుంటే ఎంత సుఖం
నువ్లేకుండా ఉండలేనే నేనొక్షణం
నన్ను నడిపించేవి నీ మాటలే
దారి చూపించేవి నీ చూపులే
చిరునవ్వై ఒదిగుంటా నీ ఒడిలో నేనమ్మా
చీకట్లో దీపంలా నా దరికొచ్చావమ్మా
నువ్వే నా నేస్తం నా ప్రాణం, అమ్మ
నే చూడలేనే నీ కళ్ళల్లో చెమ్మ
రెక్కలు వచ్చాయే నా మనసుకు ఈనాడు
నేనే నువ్వైపోతానమ్మా ఓ నాడు
Written by: Yuvan Shankar Raja