Vídeo musical

Vídeo musical

Letras

ఏ' అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి
కోసేశానమ్మో దాని జడపై మనసుపడి
మెడకి నడుముకి నడుమ
నాగుపాములాగ కదలాడి
ఉరిబోసిందమ్మో దాని కురులతో ఊపిరికి
चारमीनारలాంటి lifeనే
प्यारमीनारలాగ మార్చెనే
दिलనే दीवान జేసి దీపం బెట్టిందే
ఓ' గోల్కొండకోటలాంటి నన్నే
రాణివాసమల్లె మార్చుకుంటూ
రంగులే పూసేసినాదే కళ్ళనే కుంచె చేసి
चोर बाजारకే నేను जमींदार
నన్ను దోచేవారే ఎవరు లేనేలేరు
అనుకునేలోగా నన్ను చేసేశావే चोरी
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పాతబస్తీకి నేను पहिलवान
ఎంత वस्तादనైనా పడగొట్టే నన్ను
జడగంటలతో పడేశావే పోరి
సిన్నబోయి కూసున్న ప్రేమజంట
సాయంకాలవేళ మరుగుమీద అలిగి
పొద్దుగాల ప్రేమలోన బడిపోయే జంటకోయిలలే
జంటకోయిలలే
కుదురుగుండదే మనసంతా
కునుకే పట్టదే రేయంతా
తనే లోకమై రోజంతా తిరిగేస్తూనే ఉంటా
ఎవరు ఏమన్న వినబడదే
ఎదురు ఎమున్న కనబడదే
పిల్లప్రేమలో పడ్డాక నన్ను నేనే విడిపోయా
ఓ' policeల వేట
Daily దొంగాట
మరిచేపోయానే ఈ పిల్లబాట బట్టినాక
Summonsఏ లేకుండా
Surrenderఅయిపోయా
నేరమేమి జేయకుండానే ప్రేమఖైదీనైపోయా
चोर बाजारకే నేను जमींदार
నన్ను దోచేవారే ఎవరు లేనేలేరు
అనుకునేలోగా నన్ను చేసేశావే चोरी
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పాతబస్తీకి నేను पहिलवान
ఎంత वस्तादనైనా పడగొట్టే నన్ను
జడగంటలతో పడేశావే పోరి
ఓ' అబ్బబ్బా అది ఏం పోరి
చూడగానే కళ్ళు చెదిరి
కోసేశానమ్మో దాని జడపై మనసుపడి
మెడకి నడుముకి నడుమ
నాగుపాములాగ కదలాడి
ఉరిబోసిందమ్మో దాని కురులతో ఊపిరికి
Written by: Mittapalli Surender, Suresh Bobbili
instagramSharePathic_arrow_out

Loading...