Créditos
ARTISTAS INTÉRPRETES
Sameera Bharadwaj
Intérprete
Radhan
Intérprete
Vijay Deverakonda
Actuación
COMPOSICIÓN Y LETRA
Radhan
Composición
Shreshta
Autoría
Letra
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురమే లాహిరిలే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే
(తన ధోంతననాన దిరన)
(తన ధీం ధీంతనో)
(తన ధోంతననాన దిరన)
(తన ధీం ధీంతనో)
కాలం పరుగులు ఆపి వీక్షించే అందాలే
మోహం తన్మయమొంది శ్వాసించే గంధాలే
ఊరించి రుచులను మరిగి
వణికించే తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలో
కవ్వించే దాహాలే
మౌనంగా మధువుల జడిలోన
పులకించే ప్రాణాలే
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
వీచే గాలులు దాగి
చెప్పేనే గుసగుసలే
చూసి ముసి ముసి నవ్వులు
చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట
అరుదించి ఆకాశం
సగమై ఈ సాగరమందే
అగుపించె ఆశాంతం
తీరం ముడి వేసిన దారం
తీర్చే ఎద భారాలే
మధురమే ఈ క్షణమే ఓ చెలి
మధురమే ఈ క్షణమే
మధురమే వీక్షణమే ఓ చెలి
మధురమే వీక్షణమే
మధురమే లాలసయే
మధురం లాలనయే
మధురమే లాహిరిలే
మధురం లాలితమే
మధు పవనం వీచి
మధు పవనం వీచి
పరువమే మైమరచిందిలే
Written by: Radhan, Shreshta

