Créditos

ARTISTAS INTÉRPRETES
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
Intérprete
P. Susheela
P. Susheela
Intérprete
COMPOSICIÓN Y LETRA
K. Chakravarthy
K. Chakravarthy
Composición
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Autoría

Letra

జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా
జాము రాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి
చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా
జాము రాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి
చెప్పనా రాజా
తుమ్మెదలంటని తేనెలకై
తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో
దిక్కుల కలవని విరహాలు
తుమ్మెదలంటని తేనెలకై
తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో
దిక్కుల కలవని విరహాలు
చూపులలో చలి చుర చురలూ
ఆ చలి తీరని బిర బిరలూ
అన్నీ ఆవిరి పెడుతుంటే
నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా చెప్పనా చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి
చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి
చెప్పనా రాజా
గొంతులు దాటిన గుండెలలో
కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో
అలలై పొంగిన అందాలు
గొంతులు దాటిన గుండెలలో
కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో
అలలై పొంగిన అందాలు
కాగిత కాదని పున్నమలు
వెన్నెల వీణల సరిగమలు
పేరంటానికి రమ్మంటే
పెళ్లికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా చెప్పనా చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి కలలలోన
నీవు రేపిన అలజడి
చెప్పనా రాజా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి
చెప్పనా రోజా
రాజా రోజా రాజా
Written by: K. Chakravarthy, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out

Loading...