Letra
నీలి వెన్నెల జాబిలి
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
రా మరి నా దరి
అందుకో ప్రేమని
నీలి కన్నుల కోమలి
నీలి వెన్నెల జాబిలి
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
చేరని నీ దరి
పొందనీ ప్రేమని
రాగ వీధుల సాగని
నా వలపుల కోవెల మంఠపం
నీ రాకకు పలికెను స్వాగతం
సిరిమల్లెల రువ్వే సోయగం
తొలి ప్రేమకు ఆయను తోరణం
ప్రేమలే పెన వేయగా
ఆశలే నెరవేరగా
అనురాగ సిరులు సరసాల సుధలు
మనసారా మరులు పండించుకుందమా
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
ఓ చల్లని చూపుల దేవత
ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమ రేఖల బంధమా
జత చేరుమ జీవన రాగమా
కాలమా అనుకూలము
కానుకా సుముహూర్తము
గోరింట పూల పొదరింటిలోన
నీ కంటి దీపమై జంట చేరనా
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
చేరని నీ దరి
పొందనీ ప్రేమని
రాగ వీధుల సాగని
నీలి వెన్నెల జాబిలి
వీణ నవ్వుల ఆమని
రా మరి నా దరి
అందుకో ప్రేమని
నీలి కన్నుల కోమలి
Written by: Jonnuvittula, S. V. Krishna Reddy