Créditos
ARTISTAS INTÉRPRETES
Haricharan
Intérprete
Arun Chiluveru
Intérprete
COMPOSICIÓN Y LETRA
Arun Chiluveru
Composición
Bhaskarabhatla
Autoría
Letra
ధీంతానా ధీంతానా ఇది
మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా కల
ఎదుట వాలినది నిజమేనా
ధీంతానా ధీంతానా ఇది
మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా కల
ఎదుట వాలినది నిజమేనా
కను రెప్పల కోలాటమిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులి వెచ్చగ బాగుందిది
హే నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడువనులే
నీలోంచి కదలనులే
ధీంతానా ధీంతానా ఇది
మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా కల
ఎదుట వాలినది నిజమేనా
పాల సంద్రంలా పొంగిపోతున్నా
పాల పుంతల్లో తేలిపోతున్నా
విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్నా
కురిసే తారలన్నీ దోసిళ్ళలో నింపేస్తున్నా
చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్నా
కొత్త జన్మేదో అందుకుంటున్నా
రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ
గుండెలోకి దూకినట్టు
ఉత్సవాలు జరుపుతున్నా
నింగి అంచుమీద రంగు రంగు
చేపలాగ గెంతుతున్న ఓ
ధీంతానా ధీంతానా ఇది
మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా కల
ఎదుట వాలినది నిజమేనా
ఇంత కాలంగా ఎక్కడున్నావే
ఉన్న పలంగా ఊడిపడ్డావే
తెలిసీ తెలియనట్టు
నా మనసునే లాగేసావే
అసలేం ఎరగనట్టు
నీ వెనకనే తిప్పించావే
నిన్ను చూశాకే ప్రాణమొచ్చిందే
వింత లోకంలో కాలు పెట్టిందే
నిన్ను తాకుతున్న గాలి వచ్చి
నా చెంప గిల్లుతుంటే
అంతకన్నా హాయి ఉండదే
అరె నిన్ను తప్ప కన్ను ఇంక
నన్ను కూడా చూడనందే ఓ
ధీంతానా ధీంతానా ఇది
మనసు పండగని అనుకోనా
ధీంతానా ధీంతానా కల
ఎదుట వాలినది నిజమేనా
కను రెప్పల కోలాటమిది
ఎద చప్పుడు ఆరాటమిది
నువ్విచ్చిన ఆనందమిది
నులి వెచ్చగ బాగుందిది
హే నిన్నింక వదలనులే
నీ చెయ్యి విడువనులే
నీలోంచి కదలనులే
Written by: Arun Chiluveru, Bhaskarabhatla