Letra
చంచల్ గూడ jailలో చిలకలయ్యి చిక్కారు
పలక మీద కెక్కిందయ్యో number-u
చుక్కలందుకొను రెక్కలు విప్పి
తుర్రుమంటూ ఎగిరారు
వీళ్ళ గాచారమే గుంజి తంతే బొక్కల పడ్డారు
ఏ నిమిషానికి ఏమి జరుగునో
మాటకు అర్థమే తెలిసొచ్చేనే
వెన్న తిన్న నోటితో మన్ను బుక్కిస్థిరే
ఏమి కానున్నదో ఏందో రాత
రంగురంగులా పాలపొంగులా
మస్తు మస్తు కలలు కంటే
చిట్టి గుండెకే చెప్పకుండనే ఆశపుట్టెనే
నీళ్లలో చల్లగా బతికేటి చేపనే
ఒడ్డుకే ఏస్థిరే యమ దోమపడితిరే
గట్టునున్న పుల్ల తీసి అడ్డు పెట్టనోనికి
నెత్తి మీద బండ పెట్టి ఉరికిస్తుండ్రే
అరె మారాజే తీరే ఉన్నోడ్ని
ఏ రంధి లేనోడ్ని
బతుకాగం చేసిండ్రే
ఓ బొందల తోసిండ్రే
అరె బేటా మీరు ఏది పట్టినా అది సర్వనాశనం
ఇది దైవ శాసనం
ఇంట్లో ఉన్న అన్నినాళ్లు విలువ తెల్వలేదురో
కర్మ కాలిపోయినంక కథే మారేరో
ఖైదీ బట్టలు rowdy gang-uలు
నాలుగు గోడలే నీ దోస్తులాయరే
అవ్వ పాయెరో బువ్వ పాయెరో పోరి తోటి love-ఏ పాయె
ముద్దుగున్న మీ life వద్దమి వదిలి పాయెరో
Written by: Kasarla Shyam, Kasarla Shyam Kumar, Radhan, Rajamanickam C


![Mira Chanchalguda Jail Lo Video Song [4K] | Jathi Ratnalu | Naveen Polishetty,Faria | Radhan | Anudeep KV en YouTube Mira Chanchalguda Jail Lo Video Song [4K] | Jathi Ratnalu | Naveen Polishetty,Faria | Radhan | Anudeep KV en YouTube](https://i.ytimg.com/vi/JizQbPx31kU/maxresdefault.jpg)