Dari
PERFORMING ARTISTS
Karthik
Performer
Sangeetha
Performer
COMPOSITION & LYRICS
Vijay Anthony
Composer
Sirivennela Seetharama Shastry
Lyrics
Lirik
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
హే నీ ఎదట నిలిచే వరకూ ఆపదట తరిమే పరుగు
ఏ పనట తమతో తనకు తెలుసా హో
నీ వెనక తిరిగే కనులూ చూడవట వేరే కలలు
ఏం మాయ చేసావసలు సొగసా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
పరాకులో పడిపోతుంటే కన్నె వయసు కంగారు
అరే అరే అంటూ వచ్చీ తోడు నిలబడు
పొత్తిళ్ళల్లో పసిపాపల్లే పాతికేళ్ళ మగ ఈడు
ఎక్కెకెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు
ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీకోసమే దూకుతోంది చిలిపి లాహిరి
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి నీతో సావసమే కోరుతోంది ఆదుకోమరి
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
(This is the way to go, this is ecstasy)
(This song is just awake mimicry)
(Feelin' is so meant to be yo ho!)
(This indescribable can't you see)
(Knocks me down yo baby can't believe)
(Just a survival destiny yo ho!)
ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తియ్యనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరూ
మధురమైన కబురందిందే కలత పడకు బంగారూ
పెదివితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు
గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
హే నీ ఎదట నిలిచే వరకూ ఆపదట తరిమే పరుగు
ఏ మాయ చేసావసలు సొగసా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
Written by: Sirivennela Seetharama Shastry, Vijay Anthony