Video musicale
Video musicale
Crediti
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. Chakravarthy
Composer
Devulapalli Krishnasastri
Songwriter
Testi
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలూ
ఏకమైనా హృదయాలలో ఓ ఓ
ఏకమైనా హృదయాలలో పాకే బంగరు రంగులు
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
అందీ అందని సత్యాలా సుందర మధుర స్వప్నాలా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా నాటిన పువ్వుల తోటా
తేట నీటి ఈ ఏటి ఒడ్డునా నాటిన పువ్వుల తోటా
నిండు కడవల నీరు పోసీ
గుండెల వలపులు కుమ్మరించీ
ప్రతి తీగకు చేయూతనిచ్చీ
ప్రతి మానూ పులకింప చేసీ
మనమే పెంచినదీ తోటా
మరి ఎన్నడు వాడనిదీ తోటా
మనమే పెంచినదీ తోటా మరి ఎన్నడు వాడనిదీ తోటా
మరచి పోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలీ
మరచి పోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలీ
ఆరు ఋతువులు ఆమని వేళలే మన తోటలో
అన్ని రాత్రులు పున్నమి రాత్రులే మన మనసులో
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం
మల్లెలతో వసంతం చేమంతులతో హేమంతం
వెన్నెల పారిజాతాలు
వానకారు సంపెంగలూ
వెన్నెల పారిజాతాలు
వానకారు సంపెంగలూ
అన్ని మనకు చుట్టాలేలే
వచ్చీ పోయే అతిధులే
ఈ మెడ చుట్టూ గులాబీలు
ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ఎక్కడివీ రాగాలూ చిక్కని ఈ అరుణ రాగాలూ
ష్. గల గల మన కూడదూ ఆకులలో గాలీ
జల జల మనరాదూ అలలతో కొండవాగూ
నిదరోయే కొలను నీరూ
నిదరోయే కొలను నీరూ కదపకూడదూ ఊ ఊ
ఒదిగుండే పూలతీగా ఊపరాదూ
కొమ్మపైనిట జంట పూలూ గూటిలో ఇక రెండు గువ్వలూ
ఈ మెడ చుట్టూ గులాబీలూ ఈ సిగపాయల మందారాలూ
ఎక్కడివీ రాగాలు చిక్కని ఈ అరుణ రాగాలూ
మరచిపోకుమా తోటమాలీ పొరపడి అయినా మతిమాలి
సాహిత్యం: దేవులపల్లి
Written by: Devulapalli Krishnasastri, K. Chakravarthy