Video musicale

Video musicale

Testi

చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని

ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా
తలరాతకు తలవంచదు ప్రేమ
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని
నీవు నేనులే మనస్సు ఒక్కటే
ఇద్దరైన ఈ మమకారంలో
నీవు నేననే పదాలు లేవులే
ఏకమైన ఈ ప్రియమంత్రంలో
నా గుండెలో కోకిల
నీ గొంతులో పాడగా
నా జన్మ ఓ పూవులా
నీ కొమ్మలో పూయగా
కల ఇలా కౌగిలై తనే కలే వెన్నెలై
చేయి కలిపిన చెలిమే అనురాగం
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని
నిన్నుతాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి
నీవేలే తొలి అక్షరం
నా ప్రేమ పుట్టింటికి
నీవేలే దీపాంకురం
రసానికో రాగమై రచించని కావ్యమై
చేయి కలిపిన చలవే అనుబంధం
చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నను ఎన్నడూ విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయవా నను వీడని జత నీవని
Written by: M.M. Keeravaani, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out

Loading...