Crediti
PERFORMING ARTISTS
Bheems Ceciroleo
Performer
Kapil Kapilan
Performer
Bhasakarabhatla
Performer
COMPOSITION & LYRICS
Bheems Ceciroleo
Composer
Bhasakarabhatla
Songwriter
Testi
నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
చిన్ని చిన్ని కళ్లే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే
ముక్కు మీద కోపం అందం
మూతి ముడుచుకుంటే అందం
ఝంకాలలా ఊగుతూవుంటే
ఇంకా అందమే
నీ పిచ్చి పట్టిందిలే
అది నీవైపే నెట్టిందిలే
ఏమైన బాగుందిలే
నువ్వు ఒప్పుకుంటే
జరుపుకుంట జాతరలే
నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటూ వెళ్లి పోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటూ ఉండి పోతానే
ఈ తిరిగే తిరుగుడు
గుడి చుట్టూ తిరిగితే
దిగి వచ్చి దేవతే
వరమిస్తా నంటదే
నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే ఏ ఏ ఏ
నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటూ వెళ్లి పోమాకే
పిల్లా నేను తిట్టుకుంటూ ఉండి పోలేనే
అవునంటే అవునను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను
నీలాగే అందరు
విసిగిస్తే అమ్మడూ
మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడూ ఊ
నువ్వు నవ్వుకుంటూ వెళ్లి పోమాకే
అయ్ అయ్ అయ్ అయ్
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్లి పోమాకే
పిల్లా కొంచం కసురుకుంటూ
ఉండి పోరాదే
Written by: Bhasakarabhatla, Bheems Ceciroleo