歌詞
ఆ...
చిలిపి చిలక I Love You అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం॥
ఆ...
చిలిపి చిలక I Love You అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం॥
సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక
కలికి వయ్యారాల ఒంపు
ఆ... కబురు పంపు ఆ... గుబులు చంపు
వల్లంకి రెక్కల్లో ఒళ్లారబోశాక
వయసు గోదాట్లోకి దింపు
ఆ... మరుల గుంపు ఆ... మగువ తెంపు
అహో ప్రియా మహోదయా
లయ దయ लगाओ
సుహాసిని సుభాషిణి
చెలీ సఖీ चलाओ
ఈ వసంత పూల వరదలా
నను అల్లుకోవే తీగ మరదలా
నూజివీడు మామిడో
మోజు పడ్డ కాముడో
ఇచ్చాడమ్మా తీయని జీవితం॥
ఆ...
చిలిపి చిలక I Love You అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
నీలాల మబ్బుల్లో నీళ్లోసుకున్నాక
మెరిసింది రేచుక్క రూపు
ఆ... కలల కాపు ఆ... కనుల కైపు
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టిపోయాక
తెలిసింది పిల్లోడి ఊపు
ఆ... చిలిపి చూపు ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని
ఏదే కులుమనాలి
ప్రియా ప్రియా హిమాలయా
వరించుకోమనాలి
కోనసీమ కోక మడతలా
చిగురాకు రైక ఎత్తుపొడుపులా
కొత్తపల్లి కొబ్బరో
కొంగుపల్లి జబ్బరో
నచ్చిందమ్మా అమ్మడి వాలకం॥
ఆ...
చిలిపి చిలక I Love You అన్నవేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో
చిలక పచ్చ పైటకి కోకిలమ్మ పాటకి
రేపో మాపో కమ్మని శోభనం॥
Written by: M Keeravaani, M.M.Keeravani S.V.Krishna Reddy, Veturi, Veturi Murthy