가사
తీరు మారుతోందే
పేరు తెలియకుందే
కొత్త కొత్తగుందే ఊరికే
ఎంత దగ్గరున్నా
దూరమల్లే ఉందే
నిన్న మొన్న ఇట్టా లేదులే
కరిగి కదిలి దూకుతున్న చినుకులాగ మనసే
మురిసి కురిసి వెతికి నిన్ను చేరుకున్న వరసే
చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోకు గాలిలా
ఉన్నపాటుగా వెంట పడుతూ పడుతూ
ఒక్కసారిగా ఆగితే
చుట్టూ పక్కల దిక్కులన్నీ చూస్తూ
లెక్కపెట్టనా అంకెలే
కొంచెంగా కొంచెంగా నీ దెగ్గరయి
ఇంకాస్త దూరంగా నన్నుంచితే
నీ చేయి దాటేసి ఆ గీతలే
నీకు నాకు భందమేయవా
నీకోసం ఆరాటమో
నువ్వుంటే మోమాటమో
తాకాలని నీ గురుతులో
క్షణం ఎటు కదలదే మరి
కళ్ళ ముందరే నువ్వు ఉండగా
గుండె చప్పుడే వినపడేట్టుగా
ముద్దు చేయాలనే కొరికే సిగ్గుతో చంపుతుందే
తీరు మారుతోందే
పేరు తెలియకుందే
కొత్త కొత్తగుందే ఊరికే
ఎంత దగ్గరున్నా
దూరమల్లే ఉందే
నిన్న మొన్న ఇట్టా లేదులే
కరిగి కదిలి దూకుతున్న చినుకులాగ మనసే
మురిసి కురిసి వెతికి నిన్ను చేరుకున్న వరసే
చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోకు గాలిలా
Written by: Kittu Vissapragada, Shravan Bharadwaj