가사
అద్దం లాంటి చెక్కిలి చూసి ముద్దోస్తుందంటావా
చెంపకు చారెడు కళ్లను చూసి చెంతకొస్తానంటావా అమ్మమ్మో
ఓయమ్మో
అమ్మమ్మో సోగ్గాడా వచ్చావా మావాడా
కాలిలో మువ్వలు ఘల్లంటున్నాయీ మోవిలో నవ్వులు జిల్లంటున్నాయీ
కాలిలో మువ్వలు ఘల్లంటున్నాయీ మోవిలో నవ్వులు జిల్లంటున్నాయీ
మెత్తగా ఆ
మెత్తగా సోకిందంటే నీ చేయీ మత్తుగా చిత్తై పోవును ఈ రేయీ
ఆ ఆ ఆ ఆ
ఎంతటి రసికుడవో ఇపుడే ఇపుడే తెలిసిందీ
ఆ ఆ మధు పాత్రకు ఏనాడో మా సంగతి తెలిసింది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అద్దం లాంటి చెక్కిలి చూసి అల్లాడి పోయానూ
చెంపకు చారెడు కళ్లను చూసీ చిత్తై పోతున్నానూ అమ్మమ్మో
ఓయమ్మో
అమ్మమ్మో నీ తోడూ ఓయమ్మో ఇటు చూడూ
చూపులో మైకం ఇంకా రావాలీ కైపులో పాకం ఇంకా కావాలీ
హోయ్ చూపులో మైకం ఇంకా రావాలీ కైపులో పాకం ఇంకా కావాలీ
గుండెలో ఓ
గుండెలో గుస గుసలేవో నిండాలీ దండలో ఘుమ ఘుమలెన్నో పండాలీ
ఓ ఓ ఓ ఓ
ఇంతకు మించిన తరుణం ఇంకెన్నడు రాదూ
ఆ ఆ
మనసుంటే అనుకుంటే మళ్ళీ రాకపోదూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అద్దం లాంటి చెక్కిలి చూసి ముద్దోస్తుందంటావా
చెంపకు చారెడు కళ్లను చూసి చెంతకొస్తానంటావా
అమ్మమ్మో సోగ్గాడా వచ్చావా మా వాడా
Written by: C. Narayana Reddy, T. V. Raju


