Songteksten

నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరే వరం కోరే పనేమి లేదుగా
ఎడారి దారిలో ఎదురై వానగా
తనంత తానుగా కదిలొచ్చే కానుక
నీ స్పర్శే చెప్పింది
నే సగమై ఉన్నానంటూ
నీలో కరిగిన్నాడే నేనంటూ పూర్తయినట్టు
ఇన్నాళ్లు ఉన్నట్టు నాక్కూడా
తెలియదు ఒట్టు
నువ్వంటూ రాకుంటే
నేనుండున్నా లేనట్టు
ఈ లోకంలో మనమే తొలి జంటని
అనిపించే ప్రేమంటే పిచ్చే కదా
ఆ పిచ్చే లేకుంటే ప్రేమేదని
చాటిస్తే తప్పుందా నిజం కాదా
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా
మరే వరం కోరే పనేమి లేదుగా
ఎడారి దారిలో ఎదురై వానగా
తనంత తానుగా కదిలొచ్చే కానుక
ఎందుకు జీవించాలో అనిపించిందంటే చాలు
ఎందుకు అంటూ నిన్నే
చూపిస్తాయి ప్రాణాలు
ఎవ్వరితో చెప్పొద్దు మన ఇద్దరిదే ఈ గుట్టు
నువ్వే నా గుండెలో గువ్వల్లే
గూడును కట్టు
ఏటు వెళ్ళాలో వేతికే పదాలకు
బదులై ఎదురొచ్చింది నువ్వే కదా
నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు
నేనున్నానన్నది నువ్వే కదా
Written by: Mani Sharma, Sirivennela Sitaramasastri
instagramSharePathic_arrow_out

Loading...