Songteksten
భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షంమొచ్చినా
జనగణమన అంటూనే దూకే వాడే సైనుకుడు
పెళ పెళ పెళ పెళమంటూ మంచు తుఫాను వచ్చినా
వెనకడుగే లేదంటూ దాటే వాడే సైనుకుడు
ధడ ధడ ధడ ధడమంటూ తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనుకుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు, వాడే సైనుకుడు
(సరిలేరు నీకెవ్వరు)
(నువ్వెళ్ళే రహదారికి జోహారు)
(సరిలేరు నీకెవ్వరు)
(ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు)
కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి
అండగా నేనున్నాను అని చెప్పేవాడే సైనుకుడు
ఈ దేశమే నా ఇల్లంటూ
అందరు నా వాళ్ళంటూ
కులం మతం బేధాలను భస్మం చేసేవాడే సైనుకుడు
చెడు జరగని, పగ పెరగని
బెదరెనిగని సైనుకుడు
అలుపెరగని రక్షణ పని చెదరని ముని సైనుకుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు, వాడే సైనుకుడు
(సరిలేరు నీకెవ్వరు)
(నువ్వెళ్ళే రహదారికి జోహారు)
(సరిలేరు నీకెవ్వరు)
(ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు)
(సరిలేరు... నీకెవరు)
Written by: Devi Sri Prasad