Créditos
INTERPRETAÇÃO
S. P. Balasubrahmanyam
Interpretação
Chitra
Interpretação
COMPOSIÇÃO E LETRA
K. V. Mahadevan
Composição
Acharya Atreya
Composição
Letra
నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
ఆడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
ఒకమాట పదిమాటలై అది పాటకావాలని
ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
అన్నిటా ఒక మమతే పండాలని
అది దండలో దారమై ఉండాలని
కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచి పోవాలని
పాడవే ... పాడవే ... కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
ప్రతిరోజు నువు సూర్యుడై నన్ను నిదురలేపాలని
ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరుజన్మ రావాలని
కోరికే ఒక జన్మ కావాలని
అది తీరకే మరుజన్మ రావాలని
వలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని
పాడవే... పాడవే... కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
నా గొంతు శృతిలోన
నా గుండె లయలోన
పాడవే పాడవే కోయిల
పాడుతూ పరవశించు జన్మ జన్మల
Written by: Acharya Atreya, K. V. Mahadevan

