Letra
పడమర కొండల్లో వాలిన సూరీడా
పగిల కోటలనే వదిలిన మారేడా
పడమర కొండల్లో వాలిన సూరీడా
పగిల కోటలనే వదిలిన మారేడా
తడిసిన కనుల్లో మళ్ళీ ఉదయించి
కలలో దేవుడిలా కాపై ఉంటావా
నీ అడుగలకే మడుగులు వొత్తె వాళ్ళం
నువ్వంటె ప్రాణం ఇచ్చేవాళ్ళం మేమయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
తమనేలే రాజును మోసే భాగ్యం కలిగిందనుకుంటూ
ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా
తను చిందించే చమటను తడిసే పుణ్యం దొరికిందనుకుంటూ
పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా
నీ మాటే మా మాటయ్యా
నీ చూపే శాసనమయ్యా
మా రాజూ నువ్వే తండ్రీ నువ్వే కొడుకు నువ్వే
మా ఆయువు కూడా నీదయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
Written by: M.M. Keeravani

