Créditos
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Composer
Atreya
Songwriter
Letra
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
మనసున సెగలెగసే, ఏం మాయో వెలుపల చలి కరిచే
వయసుకు అది వరస, వరసైన పిల్ల దానికది తెలుసా
మాపిటికి చలి మంటేస్తా, కాచుకో కాసంత
ఎందుకే నను ఎగదోస్త, అందుకే పడి చస్తా
చింతాకులా చీర గట్టి పూచింది పూదోట
కన్నె పువ్వు, కన్ను కొడితే తుమ్మెదకు దొంగాట
దోబూచిలే ఆట
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
ఏది ఏది చూడనీవా దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
పొద్దు ఉంది ముద్దులివ్వనా
ఇచ్చాక ముద్దులన్ని మూటగట్టనా
మూటలన్నీ విప్పి చూడనా
చూశాక నూటొకటి లెక్క చెప్పనా
నూటికి నూరైతేనే, కోటికి కొరతేనా
కోటికి కోటైతేనే, కోరికలు కొసరేనా
నోరున్నది, మాటున్నది అడిగేస్తే ఏం తప్పు
రాతిరైయ్యింది రాజుకుంది చిటపటగా చిరు నిప్పు
అరె పోవే పిల్ల అంత దూకు
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మావ కోసం
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
ఏది ఏది చూడనీవే దాన్ని
కళ్ళు ముయ్యి చూపుతాను అన్నీ
పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే
అహ నా మల్లి కోసం
Written by: Atreya, Ilaiyaraaja