Vídeo de música
Vídeo de música
Créditos
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Composer
Acharya Athreya
Songwriter
Letra
లాలలాలలా... లాలాలాలలా
ప్రేమలేదని ప్రేమించరాదని
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు... లాలలాలలా... లాలాలాలలా
మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ముసురు కప్పి మూగవోయి నీవుంటివి
ముసురు కప్పి మూగవోయి నీవుంటివి
మోడుబారి నీడ తోడు లేకుంటిని
ప్రేమలేదని... లలలాలలాలలా
గురుతు చెరిపి వేసి జీవించాలని
చెరప లేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ
ప్రేమలేదని ప్రేమించరాదని
ప్రేమలేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు... లలలాలలాలలా
లలలాలలాలలా లలలాలలాలలా
Written by: Acharya Athreya, Ilaiyaraaja


