Créditos
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Lead Vocals
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
K. Chakravarthy
Composer
Veturi Sundararama Murthy
Songwriter
Letra
ఆకు చాటు పిందె తడిసే
ఆకు చాటు పిందె తడిసే
కోకమాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
గూడు చాటు గువ్వ తడిసే
గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
ముద్దిచ్చీ ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసే
జడి వానలే కురిసీ కురిసీ
వళ్ళు తడిసీ వెల్లీ విరిసీ
వలపు సరిగంగ తానాలు చెయ్యాలి
ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహా నీ పాట విని మెరుపులోచ్చీ
అహా
నీ విరిపూలే ముడుపులిచ్చీ
చలిని పెంచీ చెలిమి పంచీ
తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
Written by: K. Chakravarthy, Veturi Sundararama Murthy

