Lyrics

పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
(పోరాటాల రాములు నీకు లాల్ సలాములు)
వృధా కాదు నీ మరణం
రేపటి సూర్యుని కిరణం
(వృధా కాదు నీ మరణం)
(రేపటి సూర్యుని కిరణం)
పోరాటాల రాములు
ఆకలికి అన్నం దొరికే
దారి చూపిన వాడా
నీ హత్యకు ఉడుకుతుంది
ఊరూరు వాడ వాడా
అందుకనే పేద రైతూ
అందుకనే పేద రైతులెత్తినారు కత్తులు
రాలి పడక తప్పదు
భూస్వామి తలల గుత్తులు
(రాలి పడక తప్పదు)
(భూస్వామి తలల గుత్తులు)
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
వృధా కాదు నీ మరణం
రేపటి సూర్యుని కిరణం
బీద బిక్కి బడుగోళ్లను
కూడ గట్టి నిలిపినావు
సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు
సివాయి జమా భూముల్లో
సివాయి జమా భూముల్లో
నువ్వెత్తిన ఎర్ర జెండ
ఎగరేస్తాం ఎర్ర కోట
బురుజులపై తప్పకుండ
(ఎగరేస్తాం ఎర్ర కోట)
(బురుజులపై తప్పకుండ)
పోరాటాల రాములు నీకు లాల్ సలాములు
(పోరాటాల రాములు నీకు లాల్ సలాములు)
వృధా కాదు నీ మరణం
రేపటి సూర్యుని కిరణం
(వృధా కాదు నీ మరణం)
(రేపటి సూర్యుని కిరణం)
పోరాటాల రాములు
Written by: Sangham, Vandematharam Srinivas
instagramSharePathic_arrow_out

Loading...