Lyrics
వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయ్
వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయ్
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగమహరాజుకి సొంతం
హో' తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయ్
వాన వాన వెల్లువాయే కొండ కోన తుళ్ళిపోయే
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయ్
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్ళిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా
ఏదో ఏదో ఏదో హాయ్
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా
ఏదో ఏదో ఏదో హాయ్
Written by: Bappi Lahiri, Bhuvanachandra

