Lyrics

తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువాన
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువాన
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
చిన్నదానీ వయసే చెంతచేర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూల ప్రాయం ఝల్లుమనదా
ఆశల తీరానా మోజులు తీర్చేనా
హద్దుమరి తెంచేస్తే యవ్వనం ఆగేనా
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగా నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై నరములు వీణ మీటే తరుణమిదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగా నలిగేనా
మధువులు కురిసే పెదవుల కొరకే
ఇరవై వసంతాలూ వేచి ఉన్నా
మదిలోని అమృతం పంచడానికేగా
పదహారు వసంతాలూ దాచుకొన్నా
ఇకపైన మన జంటా కలనైనా విడరాదే
మరీ కొంటె కలవెంట కన్నె ఎద తెరరాదే
తొలి తొలి బిడియాన పువ్వే సొగసుగా నలిగేలా
మరి మరి ముదిరే స్పర్శలు మొదలై పరవశాన పసి పరువాన
తొలి తొలి బిడియాల పువ్వా తొరపడీ పరుగేలా
Written by: A. R. Rahman, Sirivennela Seetharama Shastry
instagramSharePathic_arrow_out

Loading...