Credits
PERFORMING ARTISTS
Samy Pachigalla
Performer
COMPOSITION & LYRICS
Samy Pachigalla
Songwriter
Lyrics
బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట
రంగు మరియు పై రూపము
ప్రాముఖ్యం కానే కాదయ్యా
అర్పణల కన్నా విధేయతే మిన్న
సమర్పించు నీ హృదయము
బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా
స్వల్ప గ్రామమైన బెత్లహేము నుండి
యూదా సింహము
దీనురాలైన మరియ గర్భాన ఆది వాక్యము
మానవుడై మహోన్నతుడు
మహికి మహిమ తెచ్చెను
మానవుడై మహోన్నతుడు
మహికి మహిమ తెచ్చెను
బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా
సొంత కుమారుడ్ని అప్పగించేను
వెనుతీయక మన కొరకు
ఆయన తోడ అనుగ్రహించెను
సమస్తము కడవరకు
పాపమై పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను
పాపమై పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను
బంగారం సాంబ్రాణియు భోళమును కానుకగా
ఆశించుట లేదు యేసయ్యా
ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట
రంగు మరియు పై రూపము
ప్రాముఖ్యం కానే కాదయ్యా
అర్పణల కన్నా విధేయతే మిన్న
సమర్పించు నీ హృదయము
తందనే తానే ననే తందనానే తానా
తందనే తానే న నాతానేనా
తందనే తానే ననే తందనానే తానా
తందనే తానే న నాతానేనా
Written by: Samy Pachigalla