Lyrics

నమస్తే నా అసలుపేరు నీనా మావారు పెట్టిన తెలుగుపేరు మీనా కాలం మారుతుంది దేశాలమధ్య హద్దులు చెరిగిపోతున్నాయి నేనిక్కడ ఉండడమే దానికి సాక్ష్యం నేను దేశానికి, తెలుగు సంసకృతికి ఎందుకు ఆకర్షింపబడ్డానో చెప్తాను పాడనా తెనుగు పాట పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో కోవెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో మావులు పూవులు మోపులపైన మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒకపాట పాడనా తెనుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట త్యాగయ క్షేత్రయ రామదాసులు త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట పాడనా తెనుగు పాట ఒళ్ళంత ఒయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ ఒళ్ళంత ఒయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెళ్ళో తాళి, కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లనా నడయాడే తెనుగు తల్లి పెట్టని కోట తెనుగు నాట ప్రతిచోట ఒక పాట పాడనా తెనుగు పాట పరవశనై నే పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట
Writer(s): Devulapalli Krishna Sastry, G K Venkatesh Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out