Credits

PERFORMING ARTISTS
Sadhana Sargam
Sadhana Sargam
Performer
Kalyan Mallik
Kalyan Mallik
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Chandra Bose
Chandra Bose
Songwriter

Lyrics

సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
నీ చిరు చిరు నగవుల కిలకిల సడితో
వలపుల పాటలు పాడవా
వలపుల తెలుగుల తొలిపిలుపులలో
చెలిమికి నా మది చూపవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
నీ చిరు చిరు నగవుల కిల కిల సడితో
వలపుల పాటలు పాడవా
వలపుల తెలుగుల తొలి పిలుపులలో
చెలిమికి నా మది చూపవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
ఈ తోటలో ఏ కొమ్మకో తారాల్లే విరిసినపువ్వా
నాదో కోరిక వినవా తన సిగలో జాబిల్లి కావా
వేసంగిలో వెన్నెలలో గువ్వల్లే మెరిసిన పువ్వా
నాలా నువ్వై పోవా తన ఒడిలో పాపవు కావా
పసి పసి మనసుల మొరలను వినవా
మధురిమ మంత్రము వీయవా
మా పరుగుల ఉరుకుల ప్రేమనుత్రోవ
పరిమళ భరితము చేయవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
ముత్యానికే ముస్తాబులా తెల్లంగా
పూచిన పువ్వా
నాతో ఏకం కావా తన పదముల పూజకు రావా
గోదారికే పైటంచుల స్వచ్ఛంగా విచ్చిన పువ్వా
నాలో సిగ్గును కనవా నా తేనేలు తనకందేవ
ఇటు అటు తెలియని వయసుల గొడవ ఇది అని నువ్వే తేల్చవా
మా ఇరువురి నడుమున వారధి కావ ఈ ఒక సాయం చేయవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
సన్నజాజి పువ్వా సన్నజాజి పువ్వా చిరు చిరు నవ్వే నవ్వవా
Written by: Chandra Bose, M.M. Keeravani
instagramSharePathic_arrow_out

Loading...