制作
出演艺人
Ghantasala
表演者
作曲和作词
S. Rajeswara Rao
作曲
Pingali Nagendra Rao
词曲作者
歌词
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా

దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా
ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా
అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
రూపాయే దైవమురా రూపాయే లోకమురా రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
Written by: Pingali, Pingali Nagendra Rao, S. Rajeswara Rao