歌词
Lovely lovely melody ఎదో
మదిలో వలపే చేశా
ఎన్నో ఎన్నో రోజులు వేచిన నిమిషంలో అడుగేసా
కాలాన్నే (కాలాన్నే)
ఆపేసా (ఆపేసా)
ఆకాశాన్నే దాటేసా
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నాపైనా
నా మనసే మనసే కనిపించిందా కాస్త late ఐనా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్న దూరమెంతున్నా
మరి ఎపుడీ ఎపుడీ రోజొస్తుందని వేచిచూస్తున్నా
అరె ఎందరున్నా అందమైన మాటే నాకు చెప్పేసావుగా
అరె వంద చందమామలున్న చోటులోకే నెట్టేశావుగా
విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్నానే ఉన్నానే
తొలిప్రేమై నీలోనే ఉన్నానే
నీ పలుకే వింటూ తేనలనే మరిచాలే
నీ అలకే కంటూ ఆకలినే విడిచాలే
నీ నిద్దుర కోసం కలల తెరే తెరిచాలే
నీ మెలుకువ కోసం వెలుతురులే పరిచాలే
నువ్ మెరిసే మెరిసే హరివిల్లే నీ రంగు నేనంటా
నువ్ కురిసే కురిసే వెన్నెలవే నీ రేయి నేనవుతా
నా పేరే పిలిచే అవసరమైనా నీకు రాదంటా
కన్నీరే తుడిచే వేలై నేనే నీకు తోడుంటా
అరె ఎందరున్నా అందమైన మాటే నాకు చెప్పేసావుగా
అరె వంద చందమామలున్న చోటులోకే నెట్టేశావుగా
Written by: Sri Mani, Thaman S.


