音乐视频
音乐视频
制作
出演艺人
Mickey J Meyer
表演者
Anurag Kulkarni
表演者
Sweta Subramanian
表演者
Varun Tej
演员
Pooja Hegde
演员
作曲和作词
Mickey J Meyer
作曲
Vanamali
作词
歌词
గగన వీధిలో, ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదములా
దివిని వీడుతూ దిగిన వేళలో కళలొలికిన సరసులా
అడుగేసినారు అతిథుల్లా
అది చూసి మురిసే జగమెల్లా
అలలాగ లేచి పడుతున్నారీవేళ
కవిత నీవే
కథవు నీవే
కనులు నీవే
కలలు నీవే
కలిమి నీవే
కరుణ నీవే
కడకు నిను చేరనీయవే
గగన వీధిలో, ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదములా
రమ్మని పిలిచాక
కమ్మనిదిచ్చాక
కిమ్మని అనదింక
నమ్మని మనసింక
కొసరిన కౌగిలింతకా
వయసుకు ఇంత వేడుక
ముగిసిన ఆశకంత గోల చేయక
కవిత నీవే
కథవు నీవే
కనులు నీవే
కలలు నీవే
కలిమి నీవే
కరుణ నీవే
కడకు నిను చేరనీయవే
నడిచిన దారంతా
మన అడుగుల రాత
చదవదా జగమంతా
అది తెలిపే గాథ
కలిపిన చేయిచేయిని
చెలిమిని చేయనీయని
తెలిపిన ఆ పదాల వెంట సాగనీ
కవిత నీవే
కథవు నీవే
కనులు నీవే
కలలు నీవే
కలిమి నీవే
కరుణ నీవే
కడకు నిను చెరనీయవే
గగన వీధిలో, ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపులా
మనసు గీతిలో, మధుర రీతిలో ఎగిసిన పదములా
Written by: Mickey J Meyer, Vanamali