歌词
నదిలా నదిలా నదిలా కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా మారావే నా కథలా
చక చకమంటూ నా మనసెపుడు పరిగెడుతుందే నీ వైపే
టకటకమంటు నా మదికెపుడు వినబడుతుందే నీ పిలుపే
రెపరెపలాడే కను రెప్పలలో మెరిసేదెపుడు నీ రూపే
నా ఊపిరికే ప్రాణం అంటే నీ చూపే
నదిలా నదిలా నదిలా కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా మారావే నా కథలా
అందంలో నువ్వు హానికరం
చూస్తేనే చంపే మెత్తని కత్తె నడుం ఒంపే
అందరిలో నువ్వు కొత్త రకం
మైకంలో ముంచే మాటలు హమ్మో వినసొంపే
మల్లెల తీగను అల్లుకు పెరిగిన రోజా పువ్వువి నువ్వేలే
వెన్నెల కల్లును వెన్నుగా పూసేను నీ చిరునవ్వెలే
సిగ్గుల సంతను బుగ్గను చుట్టి ఎన్నాళ్లని ఊరిస్తావే
రేపో మాపో నీకే సొంతం చేస్తాలే
నదిలా నదిలా నదిలా కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా మారావే నా కథలా
తేనెలలో వీరి తేనె నువ్వే
తియ్యంగా నువ్వే పంచుతే చేదైనా తీపే
మే నెలలో పొగ మంచు నువే
చల్లంగా నువ్వే తాకితే ఎండైనా మంచే
చిరు చిరు పెదవుల చుర చుర కత్తికి పదునే పెంచేను తోలి ముద్దు
గడి గడి పరుగుల గడియారాలకు సెలివిక ఆపొద్దు
చలి గిలి పెంచుతూ చంపేస్తున్నది నీ కను సైగల తీపి విషం
కౌగిలి ఔషదమిస్తా రా ఇక ఈ నిమిషం
నదిలా నదిలా నదిలా కదిలావే ఓ నదిలా
అలలా అలలా అలలా తడిపావే నన్ను ఇలా
కలలా కలలా కలలా కలిసావే ఓ కలలా
కథలా కథలా కథలా మారావే నా కథలా
Written by: Devi Sri Prasad, Shree Mani


