音乐视频

音乐视频

歌词

ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడమెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాధ
(అమ్మలాలాపైడి కొమ్మలాలా లేడీ ఏవయ్యాడు
జాడలేడీయ్యాల కోటితందానాల ఆనందలాల
గోవులాల పిల్లగ్రోవురాల గొల్లభామలాల
యేడనుంది అలనాటి నందలాల ఆనందలీల)
(అమ్మలాలాపైడి కొమ్మలాలా లేడీ ఏవయ్యాడు
జాడలేడీయ్యాల కోటితందానాల ఆనందలాల)
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్ల వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
నల్లరాతి కండలతో, కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో, కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జాన పదాలతో జ్ఞాననీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి ననమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల (అమ్మలాలాపైడి కొమ్మలాలా లేడీ ఏవయ్యాడు)
(జాడలేడీయ్యాల కోటితందానాల ఆనందలాల)
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల (గోవులాల పిల్లగ్రోవురాల గొల్లభామలాల)
(యేడనుంది అలనాటి నందలాల ఆనందలీల)
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆనందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆనందలాల
తులసి దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాల పాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకుచెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీల
Written by: M.M. Keeravaani, Sirivennela Seetharama Sastry
instagramSharePathic_arrow_out

Loading...