制作

出演艺人
S. P. Balasubrahmanyam
S. P. Balasubrahmanyam
表演者
Shreya Ghoshal
Shreya Ghoshal
表演者
作曲和作词
Ilaiyaraaja
Ilaiyaraaja
作曲
Jonnavitthula
Jonnavitthula
词曲作者

歌词

జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
ఆ జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
సార్వభౌమునిగ పూర్ణకుంభములె స్వాగతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే
నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే
న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే
రాజమకుటమే ఒసగెలే నవరత్నకాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం
సామ్రాజ్య లక్ష్మియే పాదస్పర్శకి పరవశించి పోయే
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే
రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే
రామదర్శనము జన్మధన్యమని రాయి కూడ తెలిపే
రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే
రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం
ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఔగాక
మా జీవనమే ఇక పావనమౌగాక
నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
Written by: Ilaiyaraaja, Jonnavithula Ramalingeswara Rao, Jonnavitthula
instagramSharePathic_arrow_out

Loading...