積分
演出藝人
M.M. Keeravani
演出者
Devi Sri Prasad
演出者
Malavika
演出者
詞曲
M.M. Keeravani
作曲
Suddhala Ashok Teja
詞曲創作
歌詞
హోలేసా హోలేసా
హోలేసా హొలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుసూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టు
హోలేసా హోలేసా
హోలేసా హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
క్రిష్ణయ్యకు పించమైన నెమిలమ్మల దుంకులాట
దుంకులాట (దుంకులాట)
ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట
(ఎగురులాట)
రామునికి సాయం జేసిన ఉడుత పిల్లల ఉరుకులాట
(ఉరుకులాట)
చెప్పకనే చెబుతున్నవి, చెప్పకనే చెబుతున్నవి
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టు
హోలేసా హోలేసా
హోలేసా హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
సెట్టుకి పందిరేయాలనే పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలను కాసేటోణ్ణి కాపాడాలనే పిచ్చినాది
నీడనిచ్చే దేవునికి నీడనిచ్చే ఎదురుసూపు
ఇన్నాళ్లకు నిజమయ్యే వివరం కనబడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడి వస్తున్నట్టు
హోలేసా హొలే హోలేసా
హోలేసా హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
ఎందుకీ ఉలికిపాటు గగ్గురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు
ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడ ఎడమకన్ను అదురుతుంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టు
హోలేసా హోలేసా
హోలేసా హొలే హోలేసా
హోలేసా హోలేసా
హోలేసా హొలే హోలేసా
హోలేసా హొలే హోలేసా
హోలేసా హోలేసా
Written by: M.M. Keeravani, Suddhala Ashok Teja