積分
演出藝人
K.S. Chithra
演出者
Raqeeb Alam
演出者
詞曲
Devi Sri Prasad
作曲
Sirivennela Sitarama Sastry
詞曲創作
歌詞
సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో
(సినుకు రవ్వలో సినుకు రవ్వలో)
(సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో)
పంచెవన్నె చిలకల్లే వజ్జరాల తునకల్లే
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో
సినుకు రవ్వలో సినుకు రవ్వలో
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా
ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా
చుట్టమల్లా వస్తావే చూసెల్లి పోతావే
అచ్చంగా నాతోటే నిత్యం ఉంటానంటే
చెయ్యారా చేరదీసుకోనా (కోనా కోనా)
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తరికిట తరికిట త
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా
ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా
ముద్దులొలికే ముక్కు పుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జుంకాలాగా
చేరుకోవే జిలుగులు చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా
వగలకు నిగనిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా
ఆహా నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తరికిట తరికిట త
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా
ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా
చిన్ననాటి తాయిలంలా
నిన్ను నాలో దాచుకోనా
కన్నె యేటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిలలోనా
పదములు ఆడే కథకళి లోనా
కన్నులు తడిపే కలతల లోనా
నా అణువణువు నువు కనిపించేలా
నువ్వొస్తానంటే హా నేనొద్దంటానా హా హా
నువ్వొస్తానంటే హే హే నేనొద్దంటానా
తరికిట తరికిట త
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా
ఎన్నాళ్లని దాక్కుంటావే పైనా
చుట్టమల్లా వస్తావే చూసెల్లి పోతావే
అచ్చంగా నాతోటే నిత్యం ఉంటానంటే
చెయ్యారా చేరదీసుకోనా
(నువ్వొస్తానంటే... నేనొద్దంటానా)
(నువ్వొస్తానంటే... నేనొద్దంటానా)
(నువ్వొస్తానంటే... నేనొద్దంటానా)
(నువ్వొస్తానంటే... నేనొద్దంటానా)
Written by: Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry