Hudební video

Hudební video

Texty

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు lovely లావా దేవీలు
అబబ్బ నెమ్మది
మధన మన్మది
వలది నేడదీ
మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ఎద ఉరుకులు పొదలకు ఎరుపట
పొద ఇరుకులు జతలకు చెరుకట
తొలివలపులు తొలకరి ఋతువట
చలి పిలుపులు చెలిమికి రుజువట
సొగసరి ఇటు మగసిరి అటు కలబడినది కసి కాటు
మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలిమాటు
చూపుకు చూపే చుమ్మా
ఊపిరి వెడేకొమ్మా
ముద్దుకు ముద్దె గుమ్మా
ముచ్చట నేడే నమ్మా
వయసు లేడిరో
వలపు తాడుతో
నిలిపి చూడరో
మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
రుచులాడిగెను పెదవిని పెదవులు
కోసరడిగెను వలపుల ముడుపులు
తనువడిగెను తపనల తనువులు
జతనడిగెను మదనుడి మణువులు
పులి తగిలిన గిలిరగిలిన శిల అడిగెను నీ రూపం
నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం
మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట
తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట
మెరుపు మెడలో
ఉరిమి చూడరో
కరుకు చూపరో
మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు lovely లావా దేవీలు
అబబ్బ నెమ్మది
మధన మన్మది
వలది నేడదీ
Written by: Raj Koti, Veturi Sundararama Murthy
instagramSharePathic_arrow_out

Loading...