Hudební video

Kredity

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Venigalla Rambabu
Venigalla Rambabu
Songwriter

Texty

ఒక దేవత వెలసింది నీ కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే విరిసే వెన్నెల్లోన, మెరిసే కన్నుల్లోన నీ నీడే చూసానమ్మా ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మ నీ నవ్వే నా మదిలో అమ్రుత వర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం నును సిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మునుముందుకు వచ్చేనే చెలినే చూసి అంటుందమ్మ నా మనసే నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి పూయించా నీ జడ కోసం రోజూ ఉపవసాంగ హృదయం నైవేద్యంగా పూజించా నీ జత కోసం నీరెండకు నీవెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా ఇన్నాళ్ళు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
Writer(s): S.a.raj Kumar, Venigalla Rambabu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out