Kredity
PERFORMING ARTISTS
Mallikarjun
Performer
Sumangali
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Kula Sekhar
Songwriter
Texty
హే మబ్బులోన దాగి ఉన్న చందమామ
నిన్ను మించే అందముంది చూడవమ్మా
కళ్ళు చూసి కుళ్ళుకోదా కలువభామ
ఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా హోయ్
(సంగీతం: దేవి శ్రీ ప్రసాద్)
హెయ్ ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
ఆనందం అంచులు దాటింది
మరుమల్లెగ మారి నీకోసం పల్లవి పాడింది
నా గుండెలో ఈ ఊపిరి నీ పేరునే అడిగింది
నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది
పరిచయమెరగని తొలి తొలి వయసుని తెలిసి మనసుపడని
నువ్ నాకు మనసిస్తే నిను చేరుకుంటా హొహో
మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా హెహే
ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
______
నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో
అలజడి రేగింది పులకలు రేపింది
ఎంత చెప్పినా వినకుండా ఏరులాగ నా మనసంతా
గల గల పారింది ఉరకలు వేసింది
నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి
నాతో మరి దోబూచులా రావే ఇలా ఒకసారి
వివరము అడగక ఎదురుగ నిలబడు కలల తెరలు వదిలి
నువ్ నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా
హే. ఆకాశం నేలకు వచ్చింది
చిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసింది
----"కుక్కు కుక్కు"----
ఏలేలో ఏలేలో రామసక్కని కుర్రాడే
ఏ ఊరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే
పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చటలాడాడే
చల్లని గుండెల్లో ఆడే చిచ్చుని రేపాడే
నాకోసం పుట్టాడోయమ్మా ఈ అల్లరి వాడు
మనసంతా దోచాడోయమ్మా. హోయ్
______
హే. వానవిల్లులో మెరుపంతా నీ ఒంపుసొంపులో గమనించా
తళుకుల చిరునామా నువ్వేలే మైనా
సంధ్య పొద్దులో ఎరుపంతా నీ పాల బుగ్గలో చిటికంతా
తెలియని బిడియాలే ఒదిగెను నీలోనా
నీ నవ్వుతో పున్నాగమే పూచిందిలే సుకుమారి
నీ రాకతో నా జన్మకే వెలుగొచ్చెనే తెలవారి
ఉరుకుల పరుగుల పరువపు వయసుని చెలియ వెంటపడని
నువ్ నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా
Written by: Devi Sri Prasad, Kula Sekhar