Hör dir „Podusthunna Poddumeeda“ von Gaddar an

Podusthunna Poddumeeda

Gaddar

Telugu

3.295 Shazams

Songtexte

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అదిగో ఆ కొండల నడుమ తొంగి చూచే ఎర్రని భగవంతుడు ఎవ్వడు? సూర్యుడు ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తోంది కాలం అలా కాలంతో నడిసిన వాడే కదిలి పోతాడు ఓ పొడుస్తున్న పొద్దు వందనం, వందనం ఆ, పొడుస్తున్న భలే భలే భలే భలే భలే భలే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా భలే భలే భలే భలే భలే భలే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా ఓ భూతల్లి సూర్యుడిని ముద్దాడిన భూతల్లి అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచింది అమ్మా, నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తువి భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మకేనని భలే భలే భలే భలే భలే భలే మా భూములు మకేనని మరల బడ్డ గానమ తిరగ బడ్డ రాగమా మరల బడ్డ గానమా తిరగ బడ్డ రాగమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా భలే భలే భలే భలే భలే భలే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అమ్మా, గోదావరి నీ వొడ్డున జీవించే కోట్లాది ప్రజలకు జీవనాధారం అమ్మా, కృష్ణమ్మా కిల కిల నవ్వే కృష్ణమ్మ, అమ్మా మీకు వందనం గోదావరి అలలమీద కోటి కళల గానమా కృష్ణమ్మా పరుగులకు నురుగులా హారమా మా నీళ్ళు భలే భలే భలే భలే భలే భలే మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా భలే భలే భలే భలే భలే భలే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో ఆ ప్రకృతిని చూడు అలా అలుముకుంటుంది ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి ఆ పువ్వులు అలా ఆడుతాయి అదిగో పావురాల జంట మేమెప్పుడు విడిపోమంటాయి విడిపోయిన భంధమా చెదిరిపోయిన స్నేహమా యడ బాసిన గీతమా యదల నిండ గాయమా పువ్వులు పుప్పడిలా భలే భలే భలే భలే భలే భలే పువ్వులు పుప్పడిలా పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా పవిత్ర భంధమా పరమాత్ముని రూపమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా భలే భలే భలే భలే భలే భలే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో రాజులు, దొరలు, వలస దొరలు, భూమిని, నీళ్ళని, ప్రాణుల్ని సర్వస్వాన్ని చేరబట్టారు రాజుల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు రాజరికం కత్తి మీద నెత్తురుల గాయమా దొరవారి గడులల్లో భలే భలే భలే దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంద్ర వలస తూటాలకు ఆరిపోయిన దీపమా మా పాలన భలే భలే భలే భలే భలే భలే మా పాలన మాకేనని మండుతున్న గోళమా అమర వీరుల స్వప్నమా మండుతున్న మండుతున్న గళమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా
Writer(s): Chakri, Gaddar Gaddar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out