Songtexte

Watch on, watch on, watch on, watch this dup dup dup style I am gonna dip dip dip it into your smile Hold me baby just hold my hand forever and ever Every time I wanna see you my girl మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టే అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులో వేవేల తారకలే జలకమాడుతున్నవో నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో సింగారి చెంపలో కెంజాయ సొంపులో వెచ్చనైన వేడుకలే మేలుకొలుపు విన్నవో నిదరలో ఉదయం ఎదురయే సమయం ఎదకు ఇంద్రజాలమేదో చూపుతోందె సోయగమా Baby don't you ever leave, I'm your don raja Come on every time you're my दिलरुबा I can never stop this feeling, I'm your don raja Yeah... hey... hey మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే Baby run your body with this freaky thing And I won't let you go and I won't let you down Through the fire, the limit to the wall Just to be with you I'm gladly risk it all Let me do it one more time Do it one more time Baby, come on and let's get it into the party కొల్లేటి సరసులో తుళ్ళేటి చేపలై రంగేళి కులుకులెన్నో తళుకులీనుతున్నవే నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవే ఎన్నేసి మెలికలో ఎరవేసి నన్నిలా ఏ వైపు చుపు తిప్పనీక చంపుతున్నవే వదలదే హృదయం కదలదే నిమిషం చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవే సౌందర్యమా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటీగవో తేలేదెలా లలనా వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టే అల్లికవో పోలికలో పసిబాలికవే చురకత్తుల చుపులున్నా మల్లీశ్వరివే మధురాశల మంజరివే మంత్రాక్షరివే మగశ్వాసల అంజలివే
Writer(s): Sirivennela Sitarama Sastry, Jessigift Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out