album cover
Vachchindhi
album cover
Vachchindhi wurde am 1. Januar 2000 von Aditya Music als Teil des Albums Kalisundham Raa (Original Motion Picture Soundtrack) veröffentlicht
BPM
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie

Songtexte

వచ్చింది పాల పిట్ట
తెచ్చింది పూల బుట్ట
హే నచ్చావే పాల పిట్ట
రెచ్చావే కోడిపెట్ట
నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా
నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా
మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా... హే
వచ్చింది పాల పిట్ట
తెచ్చింది పూల బుట్ట
నా పుట్టుమచ్చ మాపేటట్టు నువ్వే ముద్దెట్ట
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్ట
మొర పెట్టిందమ్మ లాల్ దుప్పట్టా
హే నచ్చావే పాల పిట్ట
తెచ్చింది పూల బుట్ట
చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు
ఎందమ్మో ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు హే
కాలేస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు
ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
ఒంపుల తొనలు ఒలుచుకుంటా
ఒంటిని తడితే జడుచుకుంటా
ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల
అందాలే రేపటికిస్తా పై పైకొస్తావేలా
అందాకా చూస్తూ ఉండాలా హేయ్
నచ్చింది పాల పిట్ట
రెచ్చావే కోడిపెట్ట
(కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు)
(హో కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు)
పొద్దున్నే పూజంటావు, మధ్యాహ్నం మడి అంటావు
సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు హొయ్
సోకంతా చిదిమేస్తావు, నడుమంతా తడిమేస్తావు
గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటా
జల్లెడ పడితే వల్లనంటా
నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశి
నీలోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి
పట్టాగా నిన్నే ఎరవేసి హేయ్
నచ్చావే పాల పిట్ట
రెచ్చావే కోడిపెట్ట
నా పుట్టుమచ్చ మాపేటట్టు నువ్వే ముద్దెట్ట
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్ట
మొర పెట్టిందమ్మ లాల్ దుప్పట్టా
హా హా హోయ్ నచ్చావే పాల పిట్ట
రెచ్చావే కోడిపెట్ట హోయ్
Written by: Chandra Bose, S. A. Raj Kumar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...