Συντελεστές
PERFORMING ARTISTS
P. Susheela
Performer
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Composer
P. Narasimha Rao
Songwriter
Στίχοι
వాన కాదు వాన కాదు
వరదా రాజా
పూల వాన కురియాలి
వరద రాజ హోయ్
వాన కాదు వాన కాదు
వరదా రాజా
పూల వాన కురియాలి
వరద రాజ
వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరినేలు బాలరాజు చూడ రాగా
వనమునేలు బాలరాణి ఎవరో అంటూ
నగరినేలు బాలరాజు చూడ రాగా
కోకిలమ్మ పాట పాడా
నెమిలి పిట్ట ఆటలాడా
సందడించి నా గుండె
ఝల్లు ఝల్లు ఝల్లుమనగా
వాన కాదు వాన కాదు
వరదా రాజా
పూల వాన కురియాలి
వరద రాజ
కొండలోన కోనలోన తిరిగే వేళ
అండదండ నీకు నేనే ఉండాలంటూ
కొండలోన కోనలోన తిరిగే వేళ
అండదండ నీకు నేనే ఉండాలంటూ
పండు వంటి చిన్నవాడు
నిండు గుండె వన్నెకాడు
చేర రాగ కాలి అందె
ఘల్లు ఘల్లు ఘల్లు మనగా
వాన కాదు వాన కాదు
వరదా రాజా
పూల వాన కురియాలి
వరద రాజ
కొండ పైన నల్ల మబ్బు
పందిరి కాగా
కోనలోన మెరుపు తీగే
తోరణ కాగా
కొండపైన నల్ల మబ్బు
పందిరి కాగా
కోనలోన మెరుపు తీగే
తోరణ కాగా
మల్లెపూల తేరు పైన
పెళ్లికొడుకు రాగానే
వాణ్ణి చూసి నా మనసు
వళ్లె వళ్లే వళ్లే యనగా
వాన కాదు వాన కాదు
వరదా రాజా
పూల వాన కురియాలి
వరద రాజ
Written by: P. Narasimha Rao, Pendyala Nageswara Rao

