Μουσικό βίντεο

Συντελεστές

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Renuka
Renuka
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
Koti
Koti
Composer
Sirivennela Sitarama Sastry
Sirivennela Sitarama Sastry
Songwriter

Στίχοι

గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా నిలువదు నిముషం నువు యెదురుంటే కదలదు సమయం కనపడకుంటే నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే నీ పేరే పలవరించే నాలోని ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నెలవై కదలని పెదవే కవితలు చదివే ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చెస్తుందమ్మా గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry, S.a.raj Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out