Lyrics
శతమానం భవతి
శతాయుః పురుష శతేంద్రియ
ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి
చక్కందాల చుక్క
కుదిరిందే పెళ్లేంచక్క
రెక్కల గుర్రం రాజు
తరాలొచ్చే వేగంగా
కుచ్చులా జల్లు పూలు
గుచ్చెత్తే గుమ్మందాలు
అది పచ్చల బంగారాలు
సిరి మువ్వుల సందళ్ళు
అరేయ్ చేతుల గోరింటాకు
బుగ్గల్లో ఎరుపెక్కింది
ఆ సిగ్గుల పేరే మందారంలా
అరిటాకుల విస్తళ్ళన్నీ
అథితుల్నే రమ్మన్నాయి
ఆ కమ్మని పిలుపే ఆహ్వానమా
సంతోషమే సంగీతమై
కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై
వైభోగమే
కలల కావేరి
కన్నె గోదారి
పల్లకిలోన రాగ
వలపు విలుకాడు
వరుని గా మారి
వధువు చేయందుకోగా
పరికిణి బాల
తరుణిగా మారే
పసుపు పారాణితో
వేద మంత్రాలు
మంగళాక్షతలు
నాదమే సాక్షిగా
పేగు బంధాలు
వీడిపోతున్న వేడుకే
పెళ్లిగా
నొసట తిలకాల
నిలిచి ఉన్నాడు
విష్ణువే వరుని తోడు
పసిడి బుగ్గల్లో
బుగ్గ చుక్కలో
హరికి సిరితోడు నేడు
ఇరువురై పుట్టి
ఒకరుగా మారు
బంధమే జీవితం
మూడు ముళ్ళేసి
అడుగులేదేసి
జరిగియే సంబరం
రామ దేవేరి
సీత రామయ్య
అర్ధనారీశ్వరం
సంతోషమే సంగీతమై
కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై
వైభోగమే
సంతోషమే సంగీతమై
కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై
వైభోగమే
Written by: Kalyan Koduri, Lakshmi Bhoopal


