Créditos
PERFORMING ARTISTS
Hariharan
Performer
Sadhana Sargam
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Composer
Veturi
Songwriter
Letras
హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె
వంకజాబిల్లి వలపులు జల్లె
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా
హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల
తేటి కోరేది తేనెల లాల
నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా
హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె
వంకజాబిల్లి వలపులు జల్లె
విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే
కన్నానులే నీ కన్నుల్లోన కలలే కన్న సావాసమే
కోకిలలా కిలకిలలే మన పూదోటలో
తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో
ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల
తేటి కోరేది తేనెల లాల
చూడాలని చలికాటే పడని చోటే ఇచ్చి చూడాలని
చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని
మరి పదవే విరిపొదకే చెలి మరియాదగా
యద కడిగా ఎదురడిగా సిరి దోచెయ్యగా
వీణవో జాణవో రతిముఖ సుఖశృతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లె
వంకజాబిల్లి వలపులు జల్లె
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా
హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పుప్పొడి జోల
తేటి కోరేది తేనెల లాల
నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా హలా
Written by: Mani Sharma, Veturi