Vídeo musical

Créditos

PERFORMING ARTISTS
Himesh Reshammiya
Himesh Reshammiya
Performer
Sadhana Sargam
Sadhana Sargam
Performer
Kamal Haasan
Kamal Haasan
Performer
COMPOSITION & LYRICS
Himesh Reshammiya
Himesh Reshammiya
Composer
Veturi Sundararama Murthy
Veturi Sundararama Murthy
Lyrics

Letras

ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా వెన్నదొంగవైనా మన్నుతింటివా కన్నెగుండె ప్రేమ లయల మృదంగానివా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా జీవకోటి నీ చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా (జైజై రామ్ జైజై రామ్ జైజై రామ్ జైజై రామ్) (సీతారామ్ జైజై రామ్ జైజై రామ్ జైజై రామ్) నీలాల నింగి కింద తేలియాడు భూమి తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగునలేచే సర్ప శేర్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమేగా అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ అట అర్జునుడొందెను నీ దయవల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే హే ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా మత్స్యమల్లే నీటిన తేలి వేదములను కాచి కూర్మరూపధారివి నీవై భువిని మోసినావే వామనుడై పాదమునెత్తి నింగి కొలిచినావే నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెన్నున్నా ఆధారం నేనే నీ ఒరవడి పట్టా ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే మదిలోని ప్రేమ నీదే మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందా వనంలో వరంగా
Writer(s): Himesh Vipin Reshammiya, Veturi Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out