Video musical

Créditos

PERFORMING ARTISTS
Mangli
Mangli
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Shree Mani
Shree Mani
Songwriter

Letra

(ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః) ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేధన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే ఇది ఓ కంట కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి (ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః) ఎవరికీ (ఎవరికీ) చెప్పవే (చెప్పవే) ఎవరినీ (ఎవరినీ) అడగవే (అడగవే) మనసులో (మనసులో) ప్రేమకే (ప్రేమకే) మాటలే (మాటలే) నేర్పవే (నేర్పవే) చూపుకందని మెచ్చని కూడా చందమామలో చూపిస్తూ చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ ఎన్నో రంగులున్నా బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి ఎవరితో (ఎవరితో) పయనమో (పయనమో) ఎవరికై (ఎవరికై) గమనమో (గమనమో) ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి (ఓం గణేశాయ నమః ఏకదంతాయ నమః)
Writer(s): Devi Sri Prasad, Shree Mani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out