Crédits
INTERPRÉTATION
S. P. Balasubrahmanyam
Interprète
Chitra
Interprète
COMPOSITION ET PAROLES
Ilaiyaraaja
Composition
Veturi
Paroles/Composition
Paroles
Aa-aa, aa-aa
Aa-aa, aa-aa
Hm-mm, hm-mm, hm-mm, hm-mm
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు, రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగి నెల తాకేదేలాగ
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
ఎలా జాలి మాటలు మాసి పోవు ఆశలు
మింగి నెల తాకేవేళ
నీవే నెనై పోయే వేళయే
నేడు కదులే రేపు లేదులే
వీడుకోనిదే, వీడుకోలిదే
Aa-aa, aa-aa, aa-aa, aa-aa
నిప్పులోన కాలదు నీటిలోన ననదు
గాలి లాగ మారదు ప్రేమ సత్యము
రాచవీటి కన్నేది రంగురంగు స్వప్నము
పేదవాడి కంటిలో ప్రేమ రక్తము
గగనాలు, భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు, మరణాలు తెరిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా యెదురులేదు ప్రేమకు
రాజ శాసనాలకే లొంగిపోవు ప్రేమలు
సవాలుగా తీసుకో ఓ నీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
Hmm-hmm, hmm-hmm, hmm-hmm, hmm-hmm
కాళిదాసు గీతి కి కృష్ణ రాసలీల కి
ప్రణయ మూర్తి రాధ కి ప్రేమ పల్లవి
ఆ అనారు ఆశ కి తాజ్మహల్ శోభ కి
పెద వాడి ప్రేమ కి చావు పల్లకి
నిధి కన్నా యెద మిన్నా
గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటే
బలి కానీ ప్రేమలే
వెళ్లిపోకు నేస్తమా
ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే
తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమా
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసి తీర్చమండిలే కసి
నింగి నెల తాకేవేళా
నీవే నేనై పోయే క్షణాన్న
లెదు శాసనం, లెదు బంధనం
ప్రేమ కే జయం, ప్రేమదే జయం
Written by: Ilaiyaraaja, Veturi

